ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి: కర్ణాటక వచ్చిన మోదీకి సిద్ధరామయ్య సూటి ప్రశ్న
- కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
- ఇప్పటికీ యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా పరిచయం చేస్తారా?
- మీ ర్యాలీల్లో ఆయన మీ పక్కనే ఉంటారా?
ఇప్పటికీ యడ్యూరప్ప సీఎం అభ్యర్థేనా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని అడిగారు. అంతకుముందు తన కుటుంబీకులకు, స్నేహితులకు టికెట్లు ఇప్పించుకున్న గాలి జనార్దన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ, ఆయన మీ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఉంటారా? అని ప్రశ్నించారు. కన్నడ ప్రజలు తమ చెవుల్లో కమలాలను పెట్టుకోలేదని నిప్పులు చెరిగారు. బీజేపీ రేపిస్టులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిందని ఆరోపిస్తూ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఉదంతాలను ప్రస్తావించారు.