Andhra Pradesh: సీఎఫ్ఎంఎస్ సర్వర్ డౌన్.. ఏపీ ఉద్యోగులకు ఆలస్యంగా అందనున్న జీతాలు

  • జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో అప్ డేట్ కాని బిల్లులు
  • రాష్ట్ర వ్యాప్తంగా సీఎఫ్ఎంఎస్ సర్వర్ డౌన్
  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యం కానున్న జీతాలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. ఈ నెల జీతాలు కాస్త ఆలస్యంగా అందే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎఫ్ఎంఎస్ సర్వర్ డౌన్ కావడమే దీనికి కారణం. దీంతో, 13 జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, 250 సబ్ ట్రెజరీల్లో జీతాల బిల్లులు అప్ లోడ్ కాలేదు. గత నెలలో కూడా సీఎఫ్ఎంఎస్ సర్వర్ డౌన్ అయింది. ఇప్పుడు మరోసారి అదే సమస్య తలెత్తడంతో... ఈ నెల కూడా జీతాలు ఆలస్యంగా అందే పరిస్థితి తలెత్తింది.
Andhra Pradesh
salary
bovernment
employees

More Telugu News