ntr: ఎన్టీఆర్ పేరును పలికే హక్కు కూడా జగన్ కు లేదు: కేశినేని నాని

  • నిజాయతీతో పార్టీని నడిపిన ఘనత ఎన్టీఆర్ ది
  • అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ
  • జగన్ పాదయాత్రకు ప్రజాస్పందనే లేదు
వైసీపీ అధినేత జగన్ ను ఏపీలో ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును ఉచ్చరించే నైతిక హక్కు కూడా జగన్ కు లేదని మండిపడ్డారు. నీతి, నిజాయతీలతో పార్టీని నడిపిన ఘనత ఎన్టీఆర్ ది అని... అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. అవినీతిపరుడైన జగన్ కు ఎన్టీఆర్ పేరును పలికే హక్కు లేదని అన్నారు.

పాదయాత్రే కాదు, పొర్లుతూ యాత్ర చేసినా జగన్ కు ప్రజాదరణ రాదని నాని ఎద్దేవా చేశారు. జగన్ యాత్రకు జనాలు రావడం లేదని... సొంత చానల్ సాక్షి ద్వారా వంద మందిని లక్ష మందిలా చూపిస్తున్నరని విమర్శించారు. నారా లోకేష్ పై విమర్శలు చేసిన నందమూరి వెంకటేశ్వరరావు తనకు కూడా తెలుసని... కొడాలి నాని వెనుక ఉండే వైసీపీ కార్యకర్త ఆయన అని చెప్పారు. పొలిటికల్ మైలేజీ కోసమే ఆయన లోకేష్ పై విమర్శలు చేశారని అన్నారు.
ntr
Jagan
Kodali Nani
Kesineni Nani

More Telugu News