'వీ5' చానల్ హెడ్ కు యాక్సిడెంట్... కోపమున్నా సానుభూతి చూపిన శ్రీరెడ్డి!
- ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన చానల్ హెడ్ మీరు
- యాక్సిడెంట్ అయిందని విన్నాము
- తోటి జర్నలిస్టుగా సానుభూతిని చూపిస్తున్నానన్న శ్రీరెడ్డి
"మా మీద కరుడు కట్టిన కోపంతో వ్యతిరేక వ్యాఖ్యలతో మా ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వీ5 చానల్ హెడ్ మీరు. మీకు నా ఇంటర్వ్యూ ఇవ్వలేదని మీరు మనసులో పెట్టుకుని ఉద్యమాన్ని డ్యామేజ్ చేశారని మా వాళ్లు చెప్పారు. మాకు ఎవరి మీదా కోపం లేదు. ఏదిఏమైనా మీకు యాక్సిడెంట్ అయిందని విన్నాము. మాతోటి జర్నలిస్టుగా మీ మీద సానుభూతి చూపిస్తూ... మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని వ్యాఖ్యానించింది.