‘మంచి రోజులు వస్తాయి’.. వైరల్ అవుతున్న ఆశారాం బాపు ఆడియో క్లిప్
- జైలు నుంచి తన అనుచరుడితో ఫోన్లో మాట్లాడిన ఆశారాం
- రికార్డు అయిన సంభాషణ బయటకు
- తీర్పు రోజు సంయమనం పాటించినందుకు భక్తులకు కృతజ్ఞతలు
సాధారణంగా ముందుగా అనుమతించిన రెండు నంబర్లకు 80 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇస్తామని పేర్కొన్న డీజీపీ.. శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు అహ్మదాబాద్‌లోని మొతేరా ఆశ్రమానికి చెందిన భక్తుడు నిశాంత్ జాధ్వీతో మాట్లాడినట్టు చెప్పారు. ఆశారాం అతడితో మాట్లాడుతూ..‘‘ 27న సాయంత్రం 7 గంటల బులెటిన్ అన్ని ఆశ్రమాల్లోనూ వచ్చేటట్టు చూడు’’ అని ఆదేశించారు.
అలాగే తీర్పు వెలువడిన రోజు తన అనుచరులు జోధ్‌పూర్ రాకుండా సంయమనం పాటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతలను పాటించాలని, తాను అదే పని చేశానని చెప్పుకొచ్చారు. ఎవరూ రెచ్చిపోవద్దని, ఆశ్రమం లెటర్ హెడ్‌ను ఉపయోగించి ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా నమ్మవద్దని కోరారు. చివర్లో, కింది కోర్టు చేసిన పొరపాటును పై కోర్టు సవరిస్తుందని, అబద్ధాలు ఎక్కువ కాలం దాగవని, మంచి రోజులు వస్తాయని ఆశారాం ఆశాభావం వ్యక్తం చేశారు.