KCR: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు వేగవంతం.. రేపు చెన్నై వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్!

  • ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు
  • రేపు కరుణానిధి, స్టాలిన్‌లతో సమావేశం
  • వచ్చే వారం అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ
ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు చెన్నై వెళ్లనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లి, మధ్యాహ్నం 1:30 గంటలకు డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమావేశమవుతారు.

రేపు సాయంత్రం తమిళనాడుకు చెందిన మరికొందరు నేతలతోనూ కేసీఆర్‌ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారు. ఎల్లుండి మధ్యాహ్నం తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. త్వరలోనే కేసీఆర్ మరికొంత మంది రాజకీయ నాయకులతో చర్చిస్తారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించడానికి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ వచ్చే వారం హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. 
KCR
Telangana
TRS

More Telugu News