TRS: టీఆర్ఎస్ ప్లీనరీలో అతిథులకు పసందైన విందు... మెనూ ఇదిగో!

  • నేడు కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ
  • విఐపీలకు, కార్యకర్తలకు విడివిడిగా వంటకాలు
  • 15 వేల మందికి సిద్ధం
నేడు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు పసందైన విందును వడ్డించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీలకు, కార్యకర్తలకు విడివిడిగా ఏర్పాటైన విందు భోజనంలో పలు రకాల వంటకాలను వండించారు.

తెలంగాణలో ప్రత్యేకంగా వండుకునే తలకాయ కూర, పాయ, చికెన్ బిరియానీ, మటన్ బిరియానీ సహా పలు మాంసాహార వంటకాలు సిద్ధం అయ్యాయి. శాకాహారులకు దాల్చా, పచ్చి పులుసు, వెజిటబుల్ బిరియానీ, ఎండ వేడి నుంచి సేదదీర్చే అంబలి, రోటీ, బెండకాయ ఫ్రై, సాంబారు తదితరాలను రెడీ చేయించారు. దాదాపు 15 వేల మంది కార్యకర్తలు ఈ ప్లీనరీకి హాజరు కానుండగా, అందరికీ మజ్జిగ ప్యాకెట్లను చాలినన్ని అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు తెలిపారు.
TRS
Pleanery
Hyderabad
Kompally

More Telugu News