Anita: నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు మరింత దారుణంగా ఉండేది... ఇప్పుడు కొంతనయమే!: 'నువ్వు నేను' ఫేమ్ అనిత!

  • నాకు కూడా వేధింపులు ఎదురయ్యాయి
  • చాకచక్యంగా అమ్మాయిలు తప్పించుకోవాలి
  • నటి అనిత స్పందన
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తుతున్న మహిళా నటుల్లో 'నువ్వు నేను' ఫేమ్ అనిత కూడా చేరిపోయింది. తనకు కూడా వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. పలు తెలుగు చిత్రాల్లో నటించి, ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో రాణిస్తూ 'నాగిన్-3' టీవీ షో చేస్తున్న అనిత, క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ, తాను హీరోయిన్ గా చేసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని గుర్తు చేసుకుంది. ఇప్పుడు కొంత ఫర్వాలేదని చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోవాలంటే అమ్మాయిలు చాకచక్యాన్ని చూపాలని సలహా ఇచ్చింది. తనకు మంచి నిర్మాతలు దొరికారని, అందువల్లే తనకు మంచి పొజిషన్ కూడా లభించిందని వ్యాఖ్యానించింది.
Anita
Casting Couch
Tollywood

More Telugu News