koaratala: కొరటాల నెక్స్ట్ మూవీపై ఆసక్తి .. బలంగా వినిపిస్తోన్న బన్నీ పేరు

  • 'భరత్ అనే నేను'తో భారీ హిట్
  • కొరటాలపై దృష్టి పెట్టిన యువ హీరోలు 
  • నెక్స్ట్ ప్రాజెక్టుపై అందరిలోను ఆసక్తి    
వినోదానికి సందేశాన్ని జత చేసి .. ఆనందంతో పాటు ఆలోచింపజేయడం అంత తేలికైన పనేం కాదు. అంతటి కష్టతరమైన పనిని కొరటాల శివ సమర్థవంతంగా నిర్వహిస్తూ, వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వెళుతున్నారు. అలా తాజాగా ఆయన 'భరత్ అనే నేను'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాంతో యువ కథానాయకులంతా ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఎన్టీఆర్ .. చరణ్ లు రెండేసి ప్రాజెక్టులను కమిటైపోయి వున్నారు. ఇక 'నా పేరు సూర్య' తరువాత ఏ దర్శకుడితోనూ కమిట్ కానిది అల్లు అర్జున్ మాత్రమే. అందువలన ఆయనతోనే కొరటాల నెక్స్ట్ మూవీ వుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.      
koaratala
alu arjun

More Telugu News