Pawan Kalyan: దేవుడా! నా కల నిజమైతే బాగుంటుంది!: కమెడియన్ పృథ్వీరాజ్

  • తెల్లవారుజామున ఆ కల వచ్చింది
  • ఆ మాటలు కలలో నారద మహాముని అన్నారు
  • జగన్, పవన్ ల భావజాలం ఒకేలా వుంది 
మొన్నీ మధ్య తెల్లవారుజామున తనకు ఓ కల వచ్చిందని, ఆ కల నిజమైతే బాగుంటుందని దేవుడిని కోరుకుంటానంటూ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఇంతకీ, ఆ కల ఏంటంటే.. ‘‘ఏం పృథ్వీ గారూ లెగండి.. లెగండి.. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు యువ నాయకులు కలిసిపోయారు’ అని నారద మహాముని నాతో అన్నారట.

‘అయిబాబోయ్.. అని లేచేసరికి.. ఆరైంది..‘ఇది కల’ అనుకుంటూ.. షూటింగ్ కు టైమైందని లేచి వెళ్లిపోయా’ అని సరదాగా చెప్పారు. వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ల భావజాలం ఒకేలా ఉందని, సమస్యలపై పోరాడాలనేదే వీరి అజెండా అని పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. 
Pawan Kalyan
Jagan
commedian pridhvi

More Telugu News