Puri Jagannadh: పెద్ద దర్శకుల దృష్టిలో పడటానికి మా ఆకాశ్ చాలా ట్రై చేసేవాడు: పూరీ జగన్నాథ్

  • పూరీ దర్శకత్వంలో 'మెహబూబా'
  • హీరోగా పూరీ తనయుడు ఆకాశ్ 
  • వచ్చేనెల 11వ తేదీన రిలీజ్
పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' అనే సినిమా చేశాడు. మే 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు ఉదయం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పూరీ మాట్లాడుతూ .. "పదేళ్ల వయసు నుంచే ఆకాశ్ కథలు చెబుతూ నన్ను విసిగించేవాడు" అన్నారు.

"ఒక కథలో తాను హీరోగా అనుకుని మహేశ్ కు ఒక వేషం కేటాయించాడు. తర్వాత ఆ కథను మహేశ్ కి చెప్పమని గొడవ చేసేవాడు. అలా చేస్తే ఇద్దరినీ కలిపి మహేశ్ తన్నేస్తాడని నేను చెప్పడంతో ఆగాడు.  'ఇక ఒక వయసు వచ్చాక .. నాకు వీలైతే నిన్ను హీరోగా చేస్తాను .. ఈ లోగా నీ ప్రయత్నం నువ్ చేసుకో' అని చెప్పాను. అప్పటి నుంచి రాజమౌళి .. వినాయక్ .. సుకుమార్ దృష్టిలో పడటానికి ట్రై చేసేవాడు. వాళ్లు కనిపిస్తే చాలు .. కాళ్లకి దండాలు పెట్టేసేవాడు" అంటూ నవ్వేశాడు.  
Puri Jagannadh
akash

More Telugu News