Pawan Kalyan: మన తల్లులని, ఆడపడుచులని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి.. వాళ్ల టీవీలు ఎందుకు చూడాలి?: పవన్ కల్యాణ్

  • మీడియాపై కన్నెర్రజేసిన జనసేన అధినేత
  • గత 6 నెలలుగా తనను దూషిస్తూనే ఉన్నారని ఆవేదన
  • ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్
మీడియాపై కన్నెర్రజేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సదరు టీవీ,పేపర్ సంస్థలపై ట్విట్టర్ వార్ కొనసాగిస్తున్నారు. గత 6 నెలలుగా తన మీద, తన అభిమానులు, ఫ్రెండ్స్, పార్టీ కేడర్ మీద దూషణలు కొనసాగిస్తున్నారని, చివరకు తన తల్లిని కూడా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

"మనలని, మన తల్లులని, ఆడపడుచులని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి?.. వాళ్ల టీవీలు ఎందుకు చూడాలి?.. జర్నలిజం విలువలతో ఉన్న చానెల్స్, పత్రికలు, సమదృష్టి కోణంతో ఉండాలి.. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది. వీరికి జనసేన 'వీరమహిళ' విభాగం అండగా ఉంటుంది" అంటూ పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Telangana
Hyderabad

More Telugu News