e peddireddy: టీటీడీ చైర్మన్ పుట్టా ఓ నాయకుడిగానే చర్చికి వెళ్లారు: ఇ.పెద్దిరెడ్డి

  • ఆయన క్రైస్తవుడు కాదు, హిందువే
  • దేవుడికి కులమతాలు ఉండవు
  • వెంకటేశ్వరస్వామి సేవకు, భక్తుల సేవ కోసం పనిచేస్తా
టీటీడీ బోర్డు సభ్యుడిగా తనను నియమించడం పట్ల కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎనుగుల పెద్దిరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వామి సేవకు, భక్తుల సేవ కోసం పనిచేస్తానని ప్రకటించారు. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవుడు కాదని, ఆయన హిందువేనని, ఓ నాయకుడిగానే చర్చికి వెళ్లారని తెలిపారు. దేవుడికి కులమతాలు ఉండవని కూడా అన్నారు. గతంలో తాను పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ అభివృద్ధికి పాటు పడినట్టు గుర్తు చేసుకున్నారు. అలాగే, కార్మిక నేతగా వేలాది మంది ఉద్యోగాలను టీటీడీలో క్రమబద్ధీకరించేందుకు కృషి చేశానని చెప్పారు.
e peddireddy
Telugudesam leader

More Telugu News