Rajamouli: అంబటి రాయుడు హాఫ్‌ సెంచరీ.. నిలబడి చప్పట్లు కొట్టిన రాజమౌళి!

ఐపీఎల్‌ మ్యాచుల్లో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి వచ్చారు. చెన్నై తరఫున ఆడుతోన్న అంబటి రాయుడు 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆ సమయంలో రాజమౌళి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపాడు. అక్కడి స్క్రీన్‌లపై రాజమౌళి కనపడడంతో ప్రేక్షకులు రాజమౌళి, బాహుబలి అంటూ నినాదాలు చేశారు. మరోవైపు అంబటి రాయుడి ఆటను చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తన ట్విట్టర్‌ పేజీలో బాహుబలి ఇన్నింగ్స్‌ అని పేర్కొంది.  
Rajamouli
ipl
Hyderabad

More Telugu News