Allu Arjun: రాజమహేంద్రవరంలో బన్నీకి ఘనస్వాగతం

  • కాసేపట్లో 'నా పేరు సూర్య' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌
  • తరలివచ్చిన అభిమానులు
  • మిలట్రీ మాధవరం బయలుదేరిన బన్నీ 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వ‌క్కంతం వంశీ కాంబినేషన్‌లో వస్తోన్న 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం మిలట్రీ మాధవరంలో ఈ వేడుక జరగనుంది.

కాగా,  అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఆడియో ఫంక్షన్ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకి చేరుకున్న బన్నీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. కారులోంచే వారికి అభివాదం చేస్తూ బన్నీ ముందుకు కదిలారు. ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఫ్యాన్స్‌ పోటీ పడ్డారు. అల్లు అర్జున్‌ అక్కడి నుంచి మాధవరం బయలుదేరారు.      
Allu Arjun
naa pery surya

More Telugu News