Tollywood: నా అర్ధనగ్న ప్రదర్శనకు ముందు కూడా సెటిల్ మెంట్ కు ఓ బడా డైరెక్టర్ ప్రయత్నించారు: శ్రీరెడ్డి

  • అవసరమైతే పేరు కూడా బయటపెడతా
  • మీ కరెన్సీ కట్టలు మీ దగ్గర పెట్టుకోండి
  • అమ్ముడు పోయే వాళ్లెవరో ప్రజలకు తెలుసు
  •  మెగా ఫ్యామిలీ అర్థం చేసుకుంటే చాలు
తన అర్ధనగ్న ప్రదర్శనకు ముందు కూడ ఓ బడా దర్శకుడు సెటిల్ మెంట్ కు ప్రయత్నించారని నటి శ్రీరెడ్డి పేర్కొంది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ‘ఆ విషయం మా గ్రూప్ లో వాళ్లకీ తెలుసు. దీన్ని రాజకీయానికి వాడుకోకండి ఓకే?? అవసరమైతే పేరు కూడా బయటపెడతా, పోరాటంలో ప్రాణాలకి తెగించాం.. మీ కరెన్సీ కట్టలు మీ దగ్గర పెట్టుకోండి, అమ్ముడు పోయే వాళ్లెవరో ప్రజలకు తెలుసు. మెగా ఫ్యామిలీ అర్థం చేసుకుంటే చాలు.

రెండు వందల పిచ్చి కామెంట్స్ ని మేము లెక్క చేయం, కోట్ల మంది మనుషులతో మాకు పని. మా నిజాయతీ నిరూపించుకుంటాం. అమ్మాయిలను తక్కువ చేసినా, వాడుకోవాలని ట్రై చేసినా..ఒక్కొక్కడి తాట తీస్తాం. తోలు తీసి ఫిల్మ్ నగర్ మధ్యలో ఆరేస్తాం... ’ అని తన పోస్ట్ లలో శ్రీరెడ్డి హెచ్చరించారు.



Tollywood
artist srisakthi

More Telugu News