ప్రపంచ మేధావులు అందరూ కలసి ప్రధాని మోదీకి లేఖ రాసిన వేళ
- కథువా, ఉన్నావో ఘటనలపై ఆవేదన
- ప్రధాని సరిగా స్పందించలేదని అభిప్రాయం
- లేఖపై 600 మంది సంతకాలు
కథువా, ఉన్నావో దారుణ ఘటనలు, వాటి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల పట్ల తాము తీవ్ర ఆగ్రహం, బాధను వ్యక్తం చేస్తున్నామని వారు లేఖలో తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ, హార్వార్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీతోపాటు ఐఐటీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యావేత్తలు, పరిశోధక విద్యార్థులు ప్రధానికి రాసిన లేఖపై సంతకాలు చేశారు. బాధ్యతగా భావించి ఈ లేఖ పంపుతున్నట్టు పేర్కొన్నారు.