మరింత పెరిగిపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

  • నిన్న 55 నెలల గరిష్టానికి చేరుకున్న ధరలు
  • ఈ రోజు కూడా మరింత పైకి
  • పెట్రోల్‌ ధరలు ఈ రోజు లీటరుకు రూ.74.21గా నమోదు 
  • డీజిల్‌ ధరలు లీటరుకి రూ.65.46గా నమోదు
పెట్రోల్‌ ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకీ పెరుగుతూ వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. నిన్న 55 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ రోజు కూడా జోరు తగ్గించకుండా పెట్రోల్‌ ధరలు మరో 13 పైసలు పెరిగి లీటరుకు రూ.74.21గా నమోదుకాగా, మరోవైపు డీజిల్‌ ధరలను కూడా 15 పైసలు చొప్పున పెరిగి రూ.65.46కు చేరింది. 2013 సెప్టెంబర్‌ తరువాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి. పెట్రోల్ ధర పెరుగులకు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అధికమవడమే కారణమని విశ్లేషకులు అంటున్నారు.
 
ఈ రోజు పెట్రోల్‌ ధరలు

న్యూఢిల్లీలో రూ.74.21
కోల్‌కతాలో రూ.76.91
ముంబయి లో రూ.82.06
చెన్నైలో రూ.76.99

డీజిల్‌ ధరలు
ఢిల్లీలో రూ.65.46
కోల్‌కత్తాలో రూ.68.16
ముంబయిలో రూ.69.7
చెన్నైలో రూ.69.06
Go Back to Shorts
petrol
diesel
rates

More Telugu News