మన దేశీ ఈ కామర్స్ మార్కెట్ పై ఇక అమెరికా కంపెనీల గుత్తాధిపత్యం!.. ఫ్లిప్ కార్టును కొంటున్న వాల్ మార్ట్
- మరో రెండు వారాల్లో డీల్ పై ప్రకటన
- 51 శాతం వాటాను సొంతం చేసుకునే అవకాశం
- ఈ కామర్స్ లో తొలి రెండు స్థానాల్లో ఫ్లిప్ కార్ట్, అమేజాన్ ఇండియా
ఫ్లిప్ కార్ట్ అనేది దేశీ ఈ కామర్స్ విభాగంలో అతిపెద్ద సంస్థ అనే విషయం తెలిసిందే. రెండో స్థానంలో అమెరికాకు చెందిన అమేజాన్ ఇండియా ఉంది. ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్న ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కొనేస్తే అప్పుడు నంబర్ 1, 2 రెండూ కూడా అమెరికా కంపెనీలవే అవుతాయి. దాంతో దాదాపు మెజారిటీ మార్కెట్ ఆ కంపెనీల చేతుల్లోకే వెళుతుంది. ఈ కామర్స్ లో పేటీఎం మాల్ మూడో స్థానంలో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో 51 శాతం వాటాకు వాల్ మార్ట్ 10-12 బిలియన్ డాలర్లు ఆఫర్ చేస్తోందని సమాచారం. ఈ డీల్ మే మొదటి వారానికి పూర్తవుతుందని తెలుస్తోంది.