స్వదేశంలో 'మౌని బాబా', విదేశాల్లో మాత్రం వాగుడుకాయ: మోదీపై విరుచుకుపడ్డ శివసేన
- మోదీ విఫలమయ్యారన్న భాగస్వామి శివసేన
- 'సామ్నా' పత్రికలో సంపాదకీయం
- మన్మోహన్ సూచనలు పాటిస్తే మంచిదని సలహా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సలహాలు, సూచనలను మోదీ అనుసరిస్తే బాగుంటుందని 'సామ్నా' సంపాదకీయంలో ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. ఇండియాలో మాట్లాడటం కన్నా విదేశాల్లో మాట్లాడటమే మంచిదని మోదీ అభిప్రాయపడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. లండన్ నుంచి వచ్చిన తరువాత, అక్కడ చేసిన ప్రసంగాన్నే ఇక్కడా చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కాగా, లండన్ లో మోదీ మాట్లాడుతూ, ఇండియాలో అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇండియాలో జరుగుతున్న అవమానకర ఘటనలను విదేశాల్లో ప్రస్తావించడం ఏంటని 'సామ్నా' ప్రశ్నించింది.