Pawan Kalyan: నిజమైన 'అజ్ఞాతవాసి' మీకు ఎవరో తెలుసా? లైవ్ లో చెబుతుంటా చూడండి: పవన్ కల్యాణ్

  • ఈ ఉదయం పవన్ వరుస ట్వీట్లు
  • "నిజాలను నిగ్గు తేలుద్దాం" ప్రోగ్రాం నుంచి అప్ డేట్స్
  • వైరల్ అవుతున్న పవన్ ట్వీట్స్
నిన్న టాలీవుడ్ సినీ పెద్దలకు 24 గంటల డెడ్ లైన్ విధించిన జనసేనాని పవన్ కల్యాణ్, ఈ ఉదయం వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. తాను హైదరాబాద్ లో ఉన్నానని, "నిజాలను నిగ్గు తేలుద్దాం" ప్రోగ్రాం నుంచి తాను లైవ్ లో అప్ డేట్స్ ఇస్తానని, అన్నారు. మరో ట్వీట్ లో  "నాకు ఇష్టమైన స్లోగన్ 'ఫ్యాక్షనిస్టుల ఆస్తులని జాతీయం చెయ్యాలి'... అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి, ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?" అని ప్రశ్నించారు. అంతకు కొన్ని నిమిషాల ముందు నిజమైన 'అజ్ఞాతవాసి' మీకు ఎవరో తెలుసా? అని ఇంకో ట్వీట్ పెట్టారు.

ఆపై తాజాగా, "ఒక రాష్ట్ర కాబినెట్ ర్యాంక్ మంత్రి  స్వయానా ఈ 'అజ్ఞాతవాసి'ని వాడో బ్లాక్ మెయిలర్ అని స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని, అని 'ఒకరి'తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, 'ఒకరు' ఎవరు... తెలుసుకోవాలనివుందా?!!! అని అడిగారు. పవన్ పెట్టిన ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan
Tollywood
Agnatawasi

More Telugu News