rajani kanth: రజనీకాంత్ కాలా రిలీజ్ కు ముహూర్తం కుదిరింది

  • థియేటర్ల బంద్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన 'కాలా' 
  • బంద్ విరమణ.. నిర్మాతల మండలి నిర్ణయం 
  • జూన్ 7న విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటన 
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 'కాలా' విడుదలకు ముహూర్తం కుదిరింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా తమిళ చిత్రపరిశ్రమ బంద్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేస్తామని తొలుత ప్రకటించినా...బంద్ విమరణ సందర్భంగా.. ముందుగా సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలను ముందుగా విడుదల చేయాలని విశాల్ సారధ్యంలోని నిర్మాతల మండలి నిర్ణయించింది.

దీంతో ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన 'కాలా' సినిమా జూన్ 7వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ముంబై మురికివాడల నేపథ్యంలో 'కాలా' సినిమా రూపొందింది. ఈ సినిమాలో రజనీకాంత్ 'కరికాలన్' అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించాడు. ఈ సినిమా టీజర్ కి విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. రజనీ మరో సినిమా '2.0' గ్రాఫిక్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదాపడుతూ వస్తోంది. 
rajani kanth
kalaa
vandar bar films

More Telugu News