Chandrababu: ధర్మపోరాట దీక్షను బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు : సీఎం చంద్రబాబు

  • ఏపీ కోలుకోవాలంటే పదేళ్లు పడుతుంది
  • కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదు
  • ప్రత్యేక హోదా మన హక్కు
  • నిధులు రాబట్టేందుకు ధర్మపోరాటం చేద్దాం
ధర్మపోరాట నిరాహార దీక్ష బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని, ఈ దీక్షను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. దీక్ష ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రిగా తాను చేస్తున్న ధర్మపోరాటానికి ప్రతిఒక్కరూ సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నానని అన్నారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా దీక్షను బ్రహ్మాండంగా విజయవంతం చేశారని, తెలుగువారి చైతన్యం, సత్తా ఏంటో చూపించారని అన్నారు. రాష్ట్రానికి  జరిగిన అన్యాయం నుంచి కోలుకోవాలంటే పదేళ్లు పడుతుందని, రాష్ట్రంలో అభివృద్ధి ఆగకుండా కేంద్ర ప్రభుత్వంపై పోరాడదామని, ప్రత్యేక హోదా మన హక్కు అని, ఐదు కోట్ల మంది ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదని, కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ధర్మపోరాటం చేద్దామని అన్నారు.
Chandrababu
Vijayawada

More Telugu News