కాంగ్రెస్ బస్సుయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు!: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశాను
- తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించాం
- ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేల అంశం ప్రస్తావించాం
- కేసీఆర్, మధుసూదనాచారి తమ పదవులకు రాజీనామా చేయాలి
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వానికి స్పీకర్ వత్తాసు పలుకుతూ అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. తమ పదవులను దుర్వినియోగ పరుస్తున్న కేసీఆర్, మధుసూదనాచారి రాజీనామా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.