చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పను: తమ్మారెడ్డి భరద్వాజ
- చంద్రబాబు దీక్షకు శుభాకాంక్షలు చెబుతున్నా
- రాష్ట్రం కోసం పోరాడుతున్న వ్యక్తిపై విమర్శలు వద్దు
- రాష్ట్రానికి మోసం చేసింది బీజేపీనే
ప్రజలందరి కోసం ఒక వ్యక్తి పోరాడుతుంటే... ఆయన గతంలో ఏదో చేశాడని ఆరోపిస్తూ, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి మండిపడ్డారు. మనల్ని బీజేపీ మోసం చేసిందనే విషయం అందరికీ తెలుసని... అయినా మనవాళ్లు వాళ్లతోనే కలుస్తుంటారని, వాళ్లు చెప్పేదే నమ్ముతారని దుయ్యబట్టారు. టీడీపీ కోసమో, చంద్రబాబు కోసమో మనం పోరాడటం లేదని, రాష్ట్రం కోసం పోరాడుతున్నామని అన్నారు. చంద్రబాబు చేపట్టిన పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఒక్కొక్కరు ఒక్కో కుంపటి పెట్టుకుని, ఆ కుంపట్లో కూర్చొని, ఏదేదో మాట్లాడుతూ పోతే... రాష్ట్రానికి న్యాయం జరగదని అన్నారు.