వెంకట రాహుల్‌కు ఏపీ సర్కారు భారీ నజరానా
- రూ.50 లక్షల నగదు
- గుంటూరులో ఇంటి స్థలం
- గ్రూప్-2 ఉద్యోగం
- చంద్రబాబు ప్రకటన
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... వెంకట రాహుల్‌కి రూ.50 లక్షల నగదు బహుమతి ఇస్తున్నట్లు, అలాగే ఆయన కోచ్‌కి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంకట రాహుల్‌కి గుంటూరులో ఇంటి స్థలం, గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని తెలిపారు. వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు అన్నారు. వెంకట రాహుల్ గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన క్రీడాకారుడన్న విషయం తెలిసిందే.