Andhra Pradesh: స్పీకర్ గా నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ... ! : ఏపీ స్పీకర్ కోడెల

  • ఐదు కోట్ల ఆంధ్రుల్లో స్పీకర్ కూడా ఒకడు
  • కేంద్రం మత్తు దించాలంటే ఆంధ్రుల సత్తా చూపించాల్సిందే
  • అందుకే, 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నాను
  • 42 డిగ్రీల ఉష్ణోగ్రతనూ లెక్కచేయకుండా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు
కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చేపట్టిన సైకిల్ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ, ఒక స్పీకర్ గా తాను రాజకీయాలు మాట్లాడకూడదని, అయితే నాడు పోటీపడి హామీలు ఇచ్చారని, ఆ హామీలను నాలుగేళ్లుగా అమలు చేయడం లేదని, ఇటువంటి సమయంలో కూడా రాష్ట్రం కోసం నోరెత్తకపోతే ప్రయోజనం ఉండదని భావించే మాట్లాడుతున్నానని అన్నారు.

ఐదు కోట్ల ఆంధ్రుల్లో స్పీకర్ కూడా ఒకడని, కేంద్రం తీరును నిరసిస్తూ ఈ యాత్ర చేశానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్తు దించాలంటే ఆంధ్రుల సత్తా ఏంటో చూపించాల్సిందేనని, అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని ఈ సందర్భంగా కోడెల పిలుపు నిచ్చారు. రాష్ట్ర  ప్రయోజనాల కోసం ఎవరు పోరాడుతున్నారో, కేసుల మాఫీ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారో ప్రజలకు తెలుసంటూ పరోక్షంగా వైపీసీపై విమర్శలు గుప్పించారు. 101 డిగ్రీల జ్వరంతో తాను బాధపడుతున్నా, బయట 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలు చూపించిన ఉత్సాహం వల్లే ఈ యాత్ర చేశానని కోడెల చెప్పారు.
Andhra Pradesh
kodela siva prasad

More Telugu News