Anantapur District: అనంతపురంలో యువతి కిడ్నాప్‌.. ఐదుగురు యువకులను పట్టుకున్న పోలీసులు!

  • కణేకల్‌లో యువతని అపహరించిన దుండగులు
  • రమణేపల్లి వద్ద యువతి ఆచూకీ లభ్యం
  • నిందితులు వినియోగించిన కారు స్వాధీనం
ఈ రోజు ఉదయం అనంతపురం జిల్లాలోని కణేకల్‌లో కలకలం చెలరేగింది. ఆ ప్రాంతంలో ఓ యువతిని అపహరించిన దుండగులు ఆమెను కారులో తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఆ యువతి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు యువతి ఆచూకీ కనిపెట్టారు.

బెళగుప్ప మండలం రమణేపల్లి వద్ద యువతి ఆచూకీ లభ్యమైందని, ఆమెను ఐదుగురు యువకులు కలిసి అపహరించారని, వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితులు వినియోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 
Anantapur District
Police
girl

More Telugu News