మన కుమార్తెలను దోచుకుంటే ఎలా సహిస్తాం...? వీటిని రాజకీయం చేయకండి: ప్రధాని మోదీ
- అత్యాచారం ఎప్పుడు జరిగినా అది బాధాకరమే
- దీనికి పాల్పడుతున్నది మరొకరి కుమారుడన్న విషయం గుర్తుంచుకోవాలి
- పరిష్కారానికి కఠిన విధానం అంటూ ఉండదని వ్యాఖ్యలు
- ఇంటికి ఆలస్యంగా వస్తే తనయులను కూడా ప్రశ్నించాలని సూచన
ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చాలా కఠిన విధానం అంటూ ఉండదు. అత్యాచారం అనేది ఇప్పుడు జరిగినా, గతంలో జరిగినా అది బాధాకరమే. అత్యాచార ఘటనలను రాజకీయం చేయవద్దు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పాపానికి ఒడిగట్టే వ్యక్తి మరొకరి కుమారుడన్న విషయాన్ని కూడా గుర్తించాలన్నారు. ‘‘కుమార్తె ఇంటికి ఆలస్యంగా వస్తే ఎందుకు ఆలస్యమైంది? ఎక్కడికి వెళ్లావు? ఎవరిని కలిశావు? వంటి ప్రశ్నలు వేస్తాం. ప్రతి ఒక్కరు తమ కుమార్తెలను ఇలానే అడుగుతారు. కానీ, కుమారులను కూడా ఇదే విధంగా ప్రశ్నించాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు.