మీ తిట్లు వింటుంటే అసహ్యం వేస్తోంది.. ఇప్పటికైనా కలిసి చావండి!: టీడీపీ, వైసీపీలపై తమ్మారెడ్డి ఫైర్
- మీ తిట్లను వినడానికి కాదు మేము ఉన్నది
- రాజీనామాలు చేసి వెళ్లిపోండి
- రాష్ట్రాన్ని మేమే చూసుకుంటాం
'మీ రెండు పార్టీలు రాజీనామాలు చేసి వెళ్లిపోండప్పా... మేమే చూసుకుంటాం... అది మాత్రం మీరు చేయరు... పదవులను పట్టుకుని వేలాడుతూ, ఒకరినొకరు తిట్టుకుంటూ సమయాన్ని గడిపేస్తారు' అని తమ్మారెడ్డి అన్నారు. నాలుగేళ్లు గడిచిపోయాయి... ఈ సంవత్సరమన్నా కలిసి చావండి, రాష్ట్రానికి బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీలో తొత్తులంటూ ఒక పార్టీ... నాలుగేళ్లుగా మీరు సంసారం చేశారంటూ మరొక పార్టీ... రాష్ట్ర సమస్యలను వదిలేసి రోజూ ఇదే పనేనా? అంటూ మండిపడ్డారు. 'ఇప్పటికైనా అందరూ కలిసి చావండి... రాష్ట్రం బాగుపడుతుంది' అంటూ తమ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.