సూరత్ లో బలైన చిన్నారి.. మార్కాపురం బాలికా?
- ఏప్రిల్ 6న దారుణ హత్యాచారానికి గురైన బాలిక
- బాలికను గుర్తించేందుకు పోలీసుల ప్రయత్నం
- అదృశ్యమైన 8 వేల మంది బాలికల ఫొటోల పరిశీలన
వెంటనే మార్కాపురం పోలీసులు చిన్ని తల్లిదండ్రులను తీసుకుని సూరత్ వెళ్లారు. అక్కడ బాలిక మృతదేహాన్ని పరిశీలించిన తల్లిదండ్రులు చిన్నిదిగానే భావించారు. అయితే ఆధార్ కార్డులోని వేలిముద్రలు, పుట్టుమచ్చలతో మృతురాలి ఆనవాళ్లను పోల్చి చూడగా అవి సరిపోలలేదు. దీంతో పోలీసులు మృతురాలు చిన్ని కాదనే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయినప్పటికీ చిన్ని తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోల్చి చూడాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల అనంతరం మృతురాలు చిన్ని ఔనా? కాదా? అన్న స్పష్టమైన నిర్ధారణకు రానున్నట్టు తెలుస్తోంది.