నన్ను కించపరిచేలా దూషిస్తున్నారు.. రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు!: కర్ణాటక రేడియో జాకీ ర్యాపిడ్ రష్మీ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన రేడియో జాకీ ర్యాపిడ్ రష్మీ
- సామాజిక మాధ్యమాల్లో నన్ను బెదిరిస్తున్నారు
- నా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు
- వారిపై వెంటనే చర్యలు తీసుకోండి
కాగా, రేడియో షోలో భాగంగా ఇటీవల విడుదలైన కన్నడ సినిమా ‘రాజారథ’ దర్శకుడు అనూప్ భండారీ, ఆయన సోదరుడు, హీరో నిరూప్ భండారీ, హీరోయిన్ అవంతిక షెట్టితో ర్యాపిడ్ రష్మీ ఫోన్ లో మాట్లాడింది. ‘ఈ సినిమా చూడని వారిని ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు ప్రేక్షకులను కించపరిచే విధంగా అనూప్, హీరోహీరోయిన్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ర్యాపిడ్ రష్మీపై నెటిజన్లు విరుచుకుపడటమే కాకుండా కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ, రేప్ చేస్తామని బెదిరింపులు చేస్తున్నారు.