Tollywood: చర్యకు ప్రతిచర్య తప్పదంటూ... జస్ట్ వెయిట్ అంటూ హీరో నితిన్ హెచ్చరిక!

  • న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేసిన నితిన్ 
  • ప్రతిచర్య వచ్చేస్తోందని హెచ్చరిక
  • వైరల్ అవుతున్న నితిన్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని, హీరో నితిన్ ఈ ఉదయం 11 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని, దానికోసం వేచి చూడాలని అన్నాడు. ప్రతిచర్య వస్తోందని హెచ్చరించాడు. "For every action there is an equal and opposite reaction...just wait for it....its coming!!!" అని ట్వీట్ పెట్టాడు. గత రెండు రోజులుగా టాలీవుడ్ మహిళా నటులు, ముఖ్యంగా శ్రీరెడ్డికి, పవన్ ఫ్యాన్స్ కూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, నితిన్ ఈ ట్వీట్ పెట్టడం గమనార్హం.




Tollywood
Sri Reddy
Nitin
Twitter

More Telugu News