భార్యను హింసిస్తున్న దృశ్యాల వీడియోను ఆమె పుట్టింటికి పంపి డబ్బులు డిమాండ్ చేసిన భర్త
- పుట్టింటి నుంచి 50,000 రూపాయలు తెమ్మన్న భర్త
- తీసుకురాలేనని చెప్పిన భార్య
- చిత్ర హింసలకు గురి చేసి, బ్లాక్ మెయిల్ కు దిగిన వైనం
ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి, బాధితురాలి సోదరుడికి పంపాడు. తనకు డబ్బు తెచ్చి ఇస్తే సరి, లేని పక్షంలో ఇంకా చిత్రహింసలు చవిచూస్తుందని హెచ్చరించాడు. దీంతో ఆమె సోదరుడు ఆ వీడియోను పోలీసులకు చూపించి, కేసు నమోదు చేయించి, ఆమె ఇంటికి వెళ్లి విడిపించుకున్నాడు. దీనిపై బాధితురాలు మాట్లాడుతూ, ‘నేను చదువుకోలేదు. అందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నా జీవితం నాశనమైపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు స్పృహ వచ్చేసరికి సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ ఉన్నానని ఆమె తెలిపింది. దీంతో ఆమె భర్తతో పాటు అతని నలుగురు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. వారంతా ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చేపట్టారు.