charan: చరణ్ తో బోయపాటి మూవీ .. టైటిల్ గా 'రాజవంశస్థుడు'

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • ఆల్రెడీ పూర్తయిన ఫస్టు షెడ్యూల్ 
  • త్వరలో రెండవ షెడ్యూల్      
చరణ్ తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేశారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ నుంచి చరణ్ షూటింగులో జాయిన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో కథకి తగినట్టుగా ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట.

 అయితే చరణ్ తో పాటు చిరంజీవి .. అల్లు అరవింద్ కూడా ఈ విషయంలో తమ ఆమోదాన్ని తెలియజేయవలసి ఉంటుంది. బోయపాటి 'రాజవంశస్థుడు' టైటిల్ ను అనుకుంటున్నట్టుగా ఇప్పటికే బయటికి వచ్చింది. ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తే, అదే టైటిల్ ను చరణ్ వాళ్లు ఓకే చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మరి ఇదే టైటిల్ ఖరారవుతుందో .. మరో కొత్త టైటిల్ తెరపైకి వస్తుందో చూడాలి.      
charan
boyapati

More Telugu News