కారు మిస్సయిన వైనాన్ని చూసి నవ్వుకున్న పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కారు మిస్సయిన వైనాన్ని చూసి నవ్వుకున్న పోలీసులు!

  • కారు పార్క్ చేసి షాపింగ్ కు వెళ్లిన హుయాంగ్
  • తిరిగి వచ్చేసరికి కనిపించని కారు
  • ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు
పార్క్ చేసిన కారు ఎలా మిస్సయిందో తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయిన ఘటన చైనాలోని క్వింగ్డావో ప్రాంతంలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని క్వింగ్డావో ప్రాంతానికి చెందిన హుయాంగ్‌ దగ్గర్లోని దుకాణానికి వెళ్లాడు. కారును పార్క్ చేసి, షాప్ లోకి వెళ్లాడు. పని పూర్తి చేసుకుని పార్కింగ్ దగ్గరకు వెళ్తే కారు కనిపించలేదు. దీంతో తన కారును ఎవరో దొంగిలించారని, అందులో 5000 యువాన్ల నగదు కూడా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

పార్కింగ్‌ లోని సీసీటీవీ ఫుటేజ్‌ లో రికార్డయిన వైనాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, కారును ఎవరూ దొంగిలించలేదు. కారును పార్క్ చేసిన హుయాంగ్ పార్కింగ్‌ బ్రేక్‌ వేయడం మర్చిపోయాడు. అతను షాపులో ఉండగా పెద్దగాలి వీచింది. దీంతో కారు ఆ గాలికి కదిలి, కొంత దూరం ప్రయాణించి, ఆగిపోయింది. దీంతో కారు ఉన్న చోటును పోలీసులు చూపించడంతో సదరు యజమాని వెళ్లి కారును తెచ్చుకున్నాడు.  
China
car thieft
air

More Telugu News