narasimharaju: ఆశ్చర్యపోతారు .. జయమాలినిలోని ప్రత్యేకత అదే!: నరసింహరాజు
- జయమాలిని చేసిన పాత్రలు వేరు
- బయట ఆమె స్వభావం వేరు
- ఆమె ఎవరి ఫేస్ వంక చూస్తూ మాట్లాడేవారు కాదు.
నరసింహరాజు .. జయమాలిని కలిసి వరుసగా కొన్ని జానపద చిత్రాల్లో నటించారు. వాటిలో 'జగన్మోహిని' ఘన విజయాన్ని అందుకుంది. ఈ కారణంగా ఈ కాంబినేషన్ పట్ల అప్పట్లో అంతా ఆసక్తిని చూపించేవారు. అందువలన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నరసింహరాజు పాల్గొనగా, జయమాలిని గురించిన ప్రస్తావన వచ్చింది.
అప్పుడు నరసింహారాజు స్పందిస్తూ .. "జయమాలిని వంటి స్త్రీ భూమండలంలో వుండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెరపై ఆమె పోషించిన పాత్రలు వేరు .. బయట ఆమె స్వభావం వేరు. ఆమె ఎవరి ఫేస్ వంక చూస్తూ మాట్లాడేవారు కాదు. అలాంటి స్త్రీ సినిమా రంగంలో వుండటం చాలా అరుదు. ఈ కారణంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె గురించి ఏ దర్శకుడుగానీ .. నిర్మాత గానీ .. హీరో గాని చెడుగా మాట్లాడటం జరగలేదు" అని చెప్పుకొచ్చారు.