sri reddy: హీరోలంతా సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?: శ్రీరెడ్డి

  • ఎన్నారైలకు చండాలాన్ని అంటించేందుకు కల్యాణి యత్నిస్తోంది
  • అమెరికాకు వచ్చి, అసలు నిజాలు చెబుతా
  • సందేశాలు ఇచ్చే హీరోలంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?
టాలీవుడ్ క్యారెక్టర్ నటి కరాటే కల్యాణిపై హీరోయిన్ శ్రీరెడ్డి మరోసారి విరుచుకుపడింది. కరాటే కల్యాణి, ఆమె చెంచాగాళ్లు ఈ వివాదంలోకి అనవసరంగా ఎన్నారైలను లాగుతున్నారని... 'మా' అసోసియేషనే ఈ చండాలాన్నంతా చేయిస్తోందని ఆమె మండిపడ్డారు. ఎన్నారై బాడీలకు కూడా ఈ చండాలాన్ని అంటించేందుకు కల్యాణి ప్రయత్నిస్తోందని... ఎన్నారైలంతా దీనిపై స్పందించాలని కోరింది. తానా, నాటా, టాటా అసోసియేషన్లన్నీ కల్యాణిని బ్యాన్ చేయాలని విన్నవించింది.

నిధులను సమకూర్చుకునేందుకు 'మా' అసోసియేషన్ వస్తే వారిని తిరస్కరించాలని... ఎందుకంటే దానికున్న మకిలిని ఎన్నారైలకు కూడా అంటించేందుకు ప్రయత్నిస్తోందని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనపై 'మా' చేస్తున్న దాడిని ఆపకపోతే... తాను అమెరికాకు వస్తానని, తెలుగు సినీ పరిశ్రమ నిజస్వరూపాన్ని వివరిస్తానని చెప్పింది. తనను ఎంతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అయినా పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేసింది. సందేశాలు ఇచ్చే హీరోలంతా మౌనంగా ఉన్నారని... సభ్య సమాజానికి వీరంతా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించింది.  
sri reddy
karate kalyani
maa
association
nri
Tollywood
comments

More Telugu News