'బాహుబలి' నటి తమన్నాకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ ప్రకటన

అద్భుత ప్రతిభ కనబరుస్తోన్న సినీ ప్రముఖులని దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేష‌న్.. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’తో స‌త్క‌రించాల‌నుకుంటోన్న విషయం విదితమే. ఇప్పటికే ఈ అవార్డు కోసం బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, రణ్‌బీర్‌ సింగ్‌లను ఎంపిక చేశారు. తాజాగా మరొకరి పేరును వెల్లడించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలో అవంతిక పాత్రలో నటించి మెప్పించిన తమన్నా ఈ అవార్డుకు ఎంపికైంది.

ఈ నెల 21న ముంబయిలో జరిగే కార్యక్రమంలో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ను ఈ నటులు అందుకోనున్నారు. తనకు ఈ అవార్డు లభించడం పట్ల స్పందించిన తమన్నా.. తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం అరుదైన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొంది. 

Tamannaah
bahubali
Anushka Sharma

More Telugu News