వీహెచ్ ను అడ్డుకోవడంతో అంబర్ పేట్ లో ఉద్రిక్తత
- అంబర్ పేట్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
- వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన వీహెచ్ ను అడ్డుకున్న సీపీఎం కార్యకర్తలు
- వీహెచ్ అనుచరులు దాడి చేశారని ఫిర్యాదు చేసిన ఆశయ్య
ఈ సందర్భంగా, పూలే అందరివాడని, నివాళులర్పించేందుకు వచ్చిన తనపై వీహెచ్ అనుచరులు దాడి చేశారంటూ ఎంబీసీ నేత ఆశయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్ పేటకు తాము రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారని ఆయన తెలిపారు. దీనిపై వీహెచ్ అనుచరులు మండిపడ్డారు. వీహెచ్ ను అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు, కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.