sri reddy: దగ్గుబాటి అభిరామ్ విజువల్స్ బయటపెట్టిన శ్రీరెడ్డి!

షార్ట్స్‌లో చూడండి
వరుస లీకులతో టాలీవుడ్ ను వణికిస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డి... సంచలన ఫొటోలను బయటపెట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ తనను ముద్దాడుతున్న ఫొటోలను బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభిరామ్ పేరును ఇప్పటి వరకు తాను చెప్పలేదని తెలిపింది.

'అరేయ్ అభిరామ్ నీకు సిగ్గుందా?' అని అడుగుతున్నానని ఫైర్ అయింది. 'స్టూడియోలో నీవు ఎలా వాడుకున్నావో నీకు తెలుసు' అంటూ బాంబు పేల్చింది. తనను ఎలా ముద్దాడుతున్నాడో ఫొటోలో చూడాలని... ఇప్పుడు సురేష్ బాబు కొడుకును బయటకు లాగాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వ్యక్తులను వదలకూడదని... ఇలాంటి వారికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు, దళిత సంఘాలు బయటకు రావాలని కోరారు. కొన్ని వందల మంది జీవితాలను ఇతను నలిపేశాడని చెప్పింది.
Go Back to Shorts
sri reddy
Tollywood
actress
daggubati suresh babu
son
daggubati abhiram
abhiram
rana
daggubati rana

More Telugu News