గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచేసిన హెచ్ డీఎఫ్ సీ!
- రూ.30 లక్షలు దాటిన రుణాలపై పెంపు 0.20 శాతం
- రూ.30 లక్షల్లోపు రుణాలపై పెంపు స్వల్పమే
- ఇప్పటికే ఎస్ బీఐ సహా పలు బ్యాంకుల పెంపు
తాజా పెంపుతో రూ.30 లక్షల్లోపు గృహ రుణాలపై వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 8.45 శాతానికి, రూ.30-75 లక్షల మధ్య రుణాలపై వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 8.60 శాతానికి, రూ.75 లక్షలకు పైన రుణాలపై 8.50 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పదేళ్ల బాండ్లపై రాబడులు పెరిగిపోతుండంతో బ్యాంకులు రుణాలు, డిపాజిట్లపై రేట్లను పెంచుతున్న విషయం తెలిసిందే. ఎస్ బీఐ, పలు ఇతర బ్యాంకులు సైతం ఇప్పటికే ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నాయి.