KCR: ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

  • తమిళనాడులో 'కేసీఆర్ యువసేన' ఏర్పాటు
  • కాంగ్రెస్, బీజేపీ లు ప్రజలని మోసం చేస్తున్నాయి
  • థర్డ్ ఫ్రంట్ లక్ష్యం తో వెళుతున్న కేసీఆర్ విజయం సాధించాలి
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం అనుకున్నంత స్థాయిలో జరగడం లేదని, ప్రత్యేక హోదా ఉద్యమానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం అని తమిళనాడు తెలుగు యువనేత అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరిగిన కేసీఆర్ యువసేన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మా అందరికి మార్గ దర్శకుడు, భారత దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు కోసం కేసీఆర్ చేస్తున్న పనులు నచ్చడంతో వారికి మద్దతుగా ఇక్కడ 'కేసీఆర్ యువసేన' స్థాపించడం జరిగిందని ఈ సందర్బంగా కేతిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ లు ప్రజలని మోసం చేస్తున్నాయని, థర్డ్ ఫ్రంట్ లక్ష్యంతో వెళుతున్న కేసీఆర్ విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
KCR
Telangana
TRS
Telugudesam
Andhra Pradesh
Tamilnadu

More Telugu News