Allu Arjun: మాది లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు.. కానీ..: అల్లు అర్జున్

  • మాది పెద్దలు కుదిర్చిన వివాహం
  • స్నేహ మంచి స్నేహితురాలు
  • సినిమా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన స్నేహితురాలు స్నేహను లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, తమది ప్రేమ వివాహం కాదని... పెద్దలు కుదిర్చిన వివాహమే అని అల్లు అర్జున్ చెప్పాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. స్నేహ తనకు మంచి స్నేహితురాలని... తమ అభిరుచులు చాలా దగ్గరగా ఉంటాయని బన్నీ చెప్పాడు. ఈ నేపథ్యంలో, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెబుతుండేవారని... ఇదే విషయం ఇంట్లో కూడా తెలిసిపోయిందని... దీంతో, వెంటనే పెళ్లి సంబంధాన్ని మాట్లాడేశారని వెల్లడించాడు.

ప్రత్యేక కారణాలు ఏమీ లేనప్పటికీ... తనకు మొదటి నుంచి సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది కాదని చెప్పాడు. తాను సినిమా ప్రపంచంలోనే ఉన్నానని... మళ్లీ సినిమా అమ్మాయే భార్య అయితే, ఇక వేరే ప్రపంచం ఉండదని అనుకునే వాడినని తెలిపాడు. తన భార్య స్నేహకు సినిమాల గురించి పెద్దగా తెలియదని చెప్పాడు.
Allu Arjun
marriage
arranged marriage
tollywood

More Telugu News