Andhra Pradesh: ఆ మాత్రం దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవా?: రోజా

  • హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించాం
  • చంద్రబాబు ఆపని ఎందుకు చేయించడం లేదు
  • టీడీపీ ఎంపీల నిరసనలు నాటకాలే: రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించామని, అదే పనిని చంద్రబాబు ఎందుకు చేయించడం లేదని వైకాపా ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆమరణ దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డిలకు ఈ ఉదయం సంఘీభావం తెలిపిన రోజా ప్రసంగించారు. తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేవా అని ప్రశ్నించారు. కావాలనే మోదీ ఇంటివరకూ వెళ్లిన టీడీపీ ఎంపీలు వారంతట వారే అరెస్ట్ అయి డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు వారికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తూ, పదవులను వదులుకుంటుంటే, టీడీపీ ప్రజల పక్షాన్ని వదిలేసి పదవులను పట్టుకు వేలాడుతోందని ఆరోపించారు. ఎంపీలంతా రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని, కానీ, తనపై ఉన్న కేసుల భయంతో చంద్రబాబు బీజేపీ ముందు నాలుగేళ్ల పాటు తలొగ్గి నిలబడ్డారని, ఇప్పుడు తప్పదన్న పరిస్థితుల్లో తూతూమంత్రంగా నిరసనలు చెప్పిస్తున్నారని ఆరోపించారు.
Andhra Pradesh
Special Category Status
Roja
New Delhi
Telugudesam
YSRCP
Chandrababu
Jagan

More Telugu News