Jagan: జగన్ కు సవాల్ విసిరిన టీడీపీ నేత జీవీ

  • దమ్ముంటే మోదీని నిలదీయాలి
  • మోదీ నివాసం ముందు ధర్నా చేయాలి
  • 2019 ఎన్నికల తర్వాత బావిలోకి దూకేది జగనే
2019 ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. మోదీ నివాసం ముందు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్న జగన్ కు చంద్రబాబు, టీడీపీ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని దుయ్యబట్టారు. జగన్ కు దమ్ముంటే మోదీని నిలదీయాలని, ఆయన నివాసం ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబును బావిలో దూకమని జగన్ అంటున్నారని... 2019 ఎన్నికల తర్వాత జగనే బావిలోకి దూకాల్సి వస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. కాగ్ నివేదికపై చర్చకు టీడీపీ సిద్ధంగా ఉందని... గుజరాత్ లో మోదీ హయాంలో, ఏపీలో వైయస్ హయాంలో వచ్చిన కాగ్ రిపోర్టులపై కూడా చర్చకు సిద్ధం కావాలని ఛాలెంజ్ చేశారు. 
Jagan
Narendra Modi
gv anjaneyulu

More Telugu News