Tirumala: ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటూ గడ్డం మొక్కుగా చెల్లించిన దర్శకుడు!

  • గత నలభై ఏళ్లుగా నా గడ్డం మొక్కుగా చెల్లిస్తున్నా
  • ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటూ గడ్డం సమర్పించా
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కె.రాఘవేంద్రరావు
తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం పండితుల ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు, స్వామి వారికి తన మొక్కులు చెల్లించుకున్నారు.

 ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత నలభై ఏళ్లుగా తన గడ్డాన్ని స్వామి వారికి మొక్కు కింద సమర్పిస్తున్నానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటూ ఈసారి తన గడ్డం మొక్కు కింద చెల్లించానని, త్వరలో రాష్ట్ర ప్రజలు శుభవార్త వింటారని చెప్పారు. ఏపీకి మోదీ చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
Tirumala
director
k.raghavendra rao

More Telugu News