Tollywood: ఏపీకి ఏ ఇబ్బంది వచ్చినా సినీ పరిశ్రమ కలిసికట్టుగా స్పందిస్తుంది: దర్శకుడు రాఘవేంద్రరావు

ఆంధ్రప్రదేశ్ కు ఏ ఇబ్బంది వచ్చినా తెలుగు సినీ పరిశ్రమ కలిసికట్టుగా స్పందిస్తుందని, అండగా నిలుస్తుందని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Tollywood
raghavendra rao
Tirumala

More Telugu News