china jiyar swamy: కొత్త దేవుళ్లను సృష్టించడం మంచిది కాదు: చిన జీయర్ స్వామి

  • ఒకప్పుడు దేవుడు మానవులను పుట్టించేవారు
  • నేడు మానవులు కొత్త దేవుళ్లను సృష్టిస్తున్నారు
  • అసవరాల నిమిత్తం ఇలా సృష్టించడం మంచిది కాదు
ఒకప్పుడు దేవుడు మానవులను పుట్టించేవారని, నేడు మానవులు కొత్త దేవుళ్లను సృష్టిస్తున్నారని త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు. మానవులు తమ అసవరాల నిమిత్తం ఇలా కొత్త దేవుళ్లను సృష్టించడం మంచిది కాదని సూచించారు. మన పూర్వీకులు ఏం చేస్తారో మనమూ అదే చేస్తామని, అందుకే, శ్రీరాముడు మానవుడిగా జన్మించి మానవులు ఎలా జీవించాలో నేర్పించారని అన్నారు. బాలలకు వినయం, విధేయత, ధర్మమార్గాలను నేర్పించాలని చెప్పిన చిన జీయర్ స్వామి, నారాయణ మంత్రం గొప్పతనం గురించి ప్రస్తావించారు. మార్కెట్ లో అనేక రామాయణ పుస్తకాలు లభిస్తున్నప్పటికీ, వాల్మీకి రచించిన రామాయణమే ప్రామాణికమని అన్నారు. కాగా, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భద్రాచల రామగాన సమితి, శ్రీవాణి మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన భక్త రామదాసు గాన గోష్ఠిలో చినజీయర్ స్వామి పాల్గొన్నారు. 
china jiyar swamy
Hyderabad

More Telugu News