Congress: నేడు దేశ వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనున్న కాంగ్రెస్

  • కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తున్న కాంగ్రెస్ పార్టీ  
  • రాజ్ ఘాట్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన నున్న రాహుల్  
  • రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించనున్న ప్రదర్శనలు 
కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నేడు నిరాహార దీక్షలు చేపట్టనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పార్టీ నేతలు దీక్షకు దిగనున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం, సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ, దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఇంకా వివిధ సమస్యలపై తమన నిరసనను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలకు దిగనుంది. రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించేందుకు పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు.
Congress
Rahul Gandhi

More Telugu News